HomeTelugu Trendingరవి ప్రకాష్ కేసులో కొత్తకోణం..!

రవి ప్రకాష్ కేసులో కొత్తకోణం..!

1 15

టీవీ9 షేర్ల బదలాయింపు వ్యవహారంలో కొత్త కోణం బయటపడుతోంది. షేర్ల బదలాయింపులో సంస్థ మాజీ సీఈవో రవిప్రకాష్‌-సినీ నటుడు శివాజీ మధ్య జరిగింది నకిలీ ఒప్పందం అని గుర్తించారు. రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి రవిప్రకాష్‌ ఈమెయిల్స్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెక్‌ చేశారు. శక్తి అనే వ్యక్తి నుంచి డైరెక్టర్ ఎంకేవీఎన్‌ మూర్తి, రవిప్రకాశ్, రవిప్రకాశ్‌కు సన్నిహితుడైన హరి అనే వ్యక్తి, ఏబీసీఎల్‌ ఫైనాన్స్ అధికారిగా ఉన్న మూర్తి అనే మరో వ్యక్తి మధ్య జరిగిన ఈ-మెయిల్‌ సంభాషణలను సైబర్ క్రైమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-మెయిల్స్ ఆధారాలు దొరక్కుండా రవిప్రకాశ్, ఆయన అనుచరులు సర్వర్‌లో డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీసినట్లు సమాచారం.

ఒక్కరోజులోనే పాత పేర్లతో షేర్లను రవిప్రకాష్‌ బదిలీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎన్‌సీఎల్టీలో కేసు వేసేందుకే నకిలీ ఒప్పందం చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈమెయిల్స్‌ ఆధారంగానే రవిప్రకాష్‌, శివాజీలకు పోలీసులు సీఆర్‌పీసీ నోటీసులను జారీ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu