HomeTelugu Trendingఆది సాయికుమార్‌ మూవీ 'CSI సనాతన్‌' అప్డేట్‌

ఆది సాయికుమార్‌ మూవీ ‘CSI సనాతన్‌’ అప్డేట్‌

csi sanatan movie teaser up
ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘CSI సనాతన్‌’. శివశంకర్‌ దేవ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీ క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు.

ఈ సినిమా టీజర్‌ను గురువారం మధ్యాహ్నం 12.55 నిమిషాలలకు విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్‌ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నాడు. ఆదికి జోడీగా మిషా నారంగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. నందీని రాయ్‌, ఖయ్యుం, రవి ప్రకాష్ తదితరులు ఈసినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటీవ్‌ ఆఫిసర్‌గా కనిపించనున్నాడు. అనీష్ సోలోమన్‌ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu