తమిళ రచయిత వైరముత్తుకు ప్రఖ్యాత ఓఎన్వీ అవార్డు పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మలయాళీ నటి పార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అంతటి ప్రతిష్టాత్మక ఓన్వీ అవార్డు ఎలా ఇచ్చారంటూ మండిపడుతోంది. రచయితగా ‘ఓఎన్వీ కురుప్ సేవలు ఎంతో అమూల్యమైనవి. ఆయన మనకెంతో గర్వకారణం. ఆయన రచనలు అందరినీ ఎంతగానో మెప్పించాయి. అలాంటి మహనీయుడి పేరుతో ఉన్న అవార్డును ఎంతోమంది మహిళల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వైరముత్తుకు ఎలా ఇస్తారు.. ఇదెక్కడి న్యాయం అంటూ జ్యూరీ సభ్యులను ప్రశ్నించింది. ఇప్పటికే 17 మంది మహిళలు వైరముత్తుపై ఆరోపణలు చేశారని ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో పూర్తిగా తెలియదని ఆమె ఆరోపించారు. మరోవైపు ప్రముఖ గాయని చిన్మయి కూడా వైరముత్తుకు అవార్డు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.