HomeTelugu Big Storiesరానా, సురేష్‌ బాబుపై క్రిమినల్‌ కేసు నమోదు

రానా, సురేష్‌ బాబుపై క్రిమినల్‌ కేసు నమోదు

Criminal case against sures
టాలీవుడ్‌ హీరో దగ్గుబాటి రానా, ఆయన తండ్రి ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ భూ వివాదంలో దౌర్జన్యంగా తమను ఖాళీ చేయించారంటూ ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో బాధితుడు మాట్లాడుతూ.. దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారు అని ఫిర్యాదు దారుడు పోలీసులకు తెలిపారు. ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని అతడు తన ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు చేసినా బంజారా హిల్స్ పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించిన్నట్లు తెలిపాడు.

సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో సహా మరి కొంతమంది విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది కోర్టు. ఈ వ్యవహారం పై గతంలోనూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Watch Bedurulanka 2012 Telugu Movie Teaser

Follow Us on FACEBOOK TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu