HomeTelugu Newsతెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య ఎందుకు పెరుగుతుందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య ఎందుకు పెరుగుతుందో తెలుసా?

7 9
లాక్‌డౌన్‌ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య దాదాపు జీరో అని చెప్పవచ్చు. కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. నేర ప్రవృత్తి ఉన్నవాళ్లు సైతం బయటకు రావడానికి వీలు లేకపోవడంతో నేరాల సంఖ్య తగ్గిపోయింది. ఈ పరిణామాలను చూసి పోలీసులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అయితే ఎలాంటి అత్యవసర సమయాలు వచ్చినా నేరాల సంఖ్య మాత్రం ఆగేవి కావు. కానీ మొట్టమొదటి సారి కరోనా కారణంగా నేరాలు అదుపులోకి వచ్చాయి. తెలుగురాష్ట్రాల్లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

అయితే లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో జనాలు రోడ్లపైకి వస్తున్నారు. మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంతో నేరాల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాగి రోడ్లపై యాక్సిడెంట్ చేయడం, మత్తులో పలువురిపై దాడి చేయడం, కుటుంబ సభ్యులపై దాడులు ఇలా తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ రేటు పెరుగుతోంది. అసలే కరోనా కారణంగా రోడ్లపైనే
డ్యూటీలు చేస్తున్న పోలీసులకు ప్రస్తుత పరిణామాలు సవాలుగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన నేరగాళ్లు ముఖ్యంగా మద్యం అమ్మకాలు మొదలవడంతో మళ్లీ రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారు. పాత కక్షలు సైతం బయటపడుతున్నాయి. తాగి వాహనాలు నడుపుతున్నవారు, యాక్సిడెంట్‌లు చేస్తున్నవారి సంఖ్యా నెమ్మదిగా పెరుగుతోంది. లాక్‌డౌన్‌ మొదలయినప్పటి నుంచీ హైదరాబాద్‌ రోడ్లపై ట్రాఫిక్‌ లేకపోవడం ప్రమాదాలు జరక్కపోడానికి ఓ కారణం. అలాగే మద్యం షాపులు మూసివేసి ఉండటం కూడా మరోకారణమని పోలీసులు అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu