NTR Neel Update:
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో లో రాబోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ మీద అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా Devara సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నేను సినిమా మీద పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం ఇటీవల అధికారికంగా ప్రారంభమైంది కూడా.
ఇప్పటికే సినిమాకి సంబంధించిన కొన్ని షూటింగ్ షెడ్యూల్‌లు కూడా ఖరారయ్యాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా రూపొందించబడినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా బంగ్లాదేశ్ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుందట.
సినిమాలో ఎన్టీఆర్ బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన తెలుగు సమాజానికి న్యాయం చేసే పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని.. తారక్ నటన ఈ సినిమాలో హైలైట్ అవుతుందని సమాచారం. రష్మికా ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేజీఎఫ్ ఫ్రాంచైజ్ కోసం పని చేసిన సాంకేతిక బృందాన్ని ప్రశాంత్ నీల్ మళ్లీ ఈ సినిమాకి తీసుకురానున్నారు. అందులో మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ముఖ్య పాత్ర పోషించనున్నారు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, దేవర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే, War 2 షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారు
Read More: Devara సినిమా టికెట్ స్కామ్ లో ఎన్టీఆర్ హస్తం కూడా ఉందా?