HomeTelugu Big StoriesNTR: ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా గురించి క్రేజీ అప్డేట్..

NTR: ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా గురించి క్రేజీ అప్డేట్..

war 2
Crazy update about NTR Bollywood movie

NTR War 2 Update: బాలీవుడ్ లో యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి స్పై యూనివర్స్ గురించి తెలియని వారు ఉండరు. ఇప్పటికే దీనిలో భాగంగా ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పటాన్ టైగర్ 3 సినిమాలు విడుదలై మంచి విజయాలు సాధించాయి. ఇదే యూనివర్స్ లో మరొక ఇన్స్టాల్మెంట్ గా వార్ 2 సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది.

ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రెండవ హీరో పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కొన్ని అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయట. అందులో ముఖ్యంగా స్పీడ్ బోట్ చేజ్ చాలా అద్భుతంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికోసం నిర్మాతలు కూడా భారీ స్థాయిలో బడ్జెట్ ఖర్చు చేశారట. ఈ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ లో ఎన్టీఆర్ ఆరు రోజులు పాల్గొన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకొని చిత్ర బృందం ఈ సన్నివేశం షూటింగ్ పూర్తి చేసింది.

హాలీవుడ్ లో టాంబ్ రైడర్, వన్ పీస్, రెసిడెంట్ ఈవిల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించిన యాక్షన్ డైరెక్టర్ ఫ్రాన్స్ స్పిల్ హౌస్ ఈ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించారు. ఇది మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఒక ట్రైన్ చేజ్ సన్నివేశం కూడా ఉండబోతుందట. యాక్షన్ సన్నివేశాలతో పాటు సినిమాలో త్రిల్లింగ్ ఎలిమెంట్లు కూడా ఉండబోతున్నాయని, సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుందని తెలుస్తోంది.

వార్ సినిమాలో హృతిక్ రోషన్ రా ఏజెంట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు వార్ 2 సినిమాలో కూడా అదే పాత్రలో కనిపించనున్నారు. ఇక ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తారు అని సర్వత్ర ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా ఒక రా ఏజెంట్ గానే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ కల్లా పూర్తి అవుతుంది. త్వరగా నిర్మాణాంతర పనులు కూడా పూర్తిచేసి వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

NTR Upcoming Movies:

తెలుగులో ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu