Kumari Aunty: మీడియా తలుచుకుంటే.. ఓ వ్యక్తిని హీరోని చెయ్యగలదు. జీరోని చెయ్యగలదు. సరిగ్గా కుమారి ఆంటీ విషయంలోని ఇదే జరిగింది. నిన్న మొన్నటి దాకా సాధారణ మహిళగా రోడ్డు పక్క తక్కువ ధరకు భోజనాలు అమ్ముతూ జీవితం గడిపిన కుమారి ఆంటీ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది.
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టాల్ ని సందర్శిస్తారని వార్తలు వచ్చిన అప్పటి నుంచి మీడియా తాకిడి మరింతగా పెరిగింది. రోజు వందలాది కెమెరాలు ఆమెను వెంబడిస్తున్నాయి. ఇక అప్పటి నుంచి.. కుమారి ఆంటీ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.
అసలు ఆమె ఎవరు. ఎక్కడి నుంచి వచ్చింది. ఇంతకు ముందు ఏం చేసేది.. ఇప్పుడు ఇంతలా ఫేమస్ అయ్యేందుకు కారణాలేంటీ.. అన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే సమయానికే.. చిన్నా చితకా యూట్యూబ్ ఛానళ్లన్నీ ఆమెను ఇంటర్వ్యూలు చేయగా.. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానళ్లు కూడా ఆమెను ఫోకస్ చేస్తున్నాయి.
తాజాగా కుమారి ఆంటీ ఇష్యూలో మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిజిటల్ వర్గాల కథనం ప్రకారం నెట్ ఫ్లిక్స్ ఈ కుమారి ఆంటీ మీద మూడు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ తీసే ఆలోచనలో ఉందట. దీనికోసం పెద్ద మొత్తం చెల్లించేందుకు రెడీగా ఉన్నాట్లు టాక్. దీనిలో నిజం ఎంతో తెలియదుగానీ.. నెటిజన్లు మాత్రం ఓ రెంజ్లో జోక్స్ వేసుకుంటున్నారు.