HomeTelugu Newsక్యూనెట్‌ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు: పోలీస్‌కమిషనర్‌

క్యూనెట్‌ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు: పోలీస్‌కమిషనర్‌

8 25క్యూనెట్‌ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు పంపామని సైబరాబాద్‌ పోలీస్‌కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో 38 కేసులు నమోదు చేసి ఇప్పటివరకు 70 మందిని అరెస్టు చేశామన్నారు. క్యూనెట్‌ కేసులో పురోగతిని ఆయన మీడియాకు వివరించారు. బెంగళూరులోని విహాన్‌ కార్యాలయాన్ని సీజ్‌ చేశామని తెలిపారు. క్యూనెట్‌ సంస్థ రెండు అవతారాలతో ప్రజలను మోసగించిందని, ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు మేర మోసం జరిగిందని సీపీ వివరించారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే లక్ష్యంగా జరిగిన ఈ కుంభకోణంలో బాధితులు లక్షల్లో ఉన్నారని సజ్జనార్‌ చెప్పారు. ఈ సంస్థ నిరుద్యోగులను కూడా మోసం చేసిందని వివరించారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగళూరులో కేసులు నమోదు చేశామన్నారు. 206(5) కంపెనీ యాక్ట్‌ 2013 ప్రకారం ఏంసీఏ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నామని చెప్పారు. క్యూనెట్‌ కేసులో 12 మందికి ఎల్వోసీ జారీ చేసినట్లు సీపీ వివరించారు. కంపెనీతో సంబంధం లేకుండా నకిలీ డైరెక్టర్లు రూ.కోట్లు వాడుకున్నారని వెల్లడించారు. క్యూనెట్‌ బాధితులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రజలెవ్వరూ క్యూనెట్‌లో చేరవద్దని సూచించారు. క్యూనెట్‌ కుంభకోణాల వల్ల ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని సీపీ వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu