కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా తొందరలోనే అందుబాటులోకి వచ్చేలా తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మనుషులపై ప్రయోగాల దశలో ఉంది. అది విజయవంతమైతే ఆగస్ట్ 15 లోగా అందుబాటులోకి రానుంది. జంతువులపై ప్రయోగంలో మెరుగైన ఫలితాలు వచ్చాయని ఐసీఎంఆర్ వివరించింది. ఆగస్టులో కచ్చితంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురాగలమని ఐసీఎంఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యాక్సిన్ గనుక
విజయవంతమైతే ప్రపంచంలో కరోనాపై సమర్థవంతంగా పనిచేసే తొలి వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ కానుంది. ఈటీకాను ఐసీఎంఆర్, పుణెలోని ఎన్‌ఐవీ సహకారంతో భారత్ బయోటెక్ అబివృద్ధి చేస్తోంది.