HomeTelugu TrendingCourt State vs A Nobody OTT తో ఎంత లాభాలు నమోదు చేసుకుందో తెలుసా?

Court State vs A Nobody OTT తో ఎంత లాభాలు నమోదు చేసుకుందో తెలుసా?

Court Tollywood State vs A Nobody makes unexpected profits!
Court Tollywood State vs A Nobody makes unexpected profits!

Court State vs A Nobody Movie OTT:

నాని ప్రొడక్షన్ లో వచ్చిన కోర్ట్ – స్టేట్ vs. ఏ నోబడి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టింది. కథ బలంగా ఉండటం, రియలిస్టిక్ నేరేషన్, మంచి నటన – ఇవన్నీ కలిపి సినిమాను పెద్ద విజయం దిశగా నడిపించాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ సినిమా ఇప్పటికే ప్రొఫిట్ జోన్‌లోకి వెళ్లిపోయింది.

ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ. 11 కోట్లే అని చాలామందికి తెలియదు. కానీ ఇప్పటివరకు థియేట్రికల్ రన్ ద్వారా డబుల్ కలెక్షన్ వచ్చింది. అంటే, థియేటర్ల నుంచే భారీ లాభాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా, ప్రముఖ ఓటీటీ దిగ్గజం Netflix ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ రేటుకి తీసుకుంది. ఈ ఒప్పందంతో సినిమా ఖర్చులో సగం మొత్తాన్ని డిజిటల్ రైట్స్ నుంచే రికవరీ చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రియదర్శి, శివాజీ కీలక పాత్రల్లో నటించగా, వారి పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇదే కాకుండా, ఈ సినిమా ముందు పెద్దగా పోటీ లేకపోవడం కూడా కలెక్షన్ల పరంగా ప్లస్ పాయింట్ అవుతోంది. రాబోయే వారం కూడా పెద్ద సినిమాల విడుదల లేదని భావిస్తున్న తరుణంలో, కోర్ట్ – స్టేట్ vs. ఏ నోబడి బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ సినిమా సక్సెస్‌తో నాని ఎంతో హ్యాపీగా ఉన్నాడు. నిర్మాతగా తనకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా విజయంతో, నాని ఇకపై మరిన్ని విభిన్నమైన కథలను ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్. మరి, ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu