ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని జయప్రద ఉల్లంఘించారంటూ పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో, కోర్టు విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింది. గత ఎన్నికలకు ముందు జయప్రద బీజేపీలో చేరారు. సమాజ్ వాది పార్టీ నేత ఆజంఖాన్ చేతిలో లక్ష ఓట్లకు పైగా తేడాతో ఆమె ఓడిపోయారు.