HomeTelugu Newsభారత్‌లో 1721 కు చేరిన కరోనా బాధితులు

భారత్‌లో 1721 కు చేరిన కరోనా బాధితులు

11
కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1721కి చేరుకుంది. ఇక ఈ వైరస్ బారినపడి ఇప్పటి వరకు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా 150 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే… మహారాష్ట్రలో అత్యధికంగా 325 పాజిటివ్ కేసులు ఉండగా 12 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా బారినపడిన వారి సంఖ్య 97 మంది, ఆరుగురు మృతి, ఏపీలో 87 పాజిటివ్ కేసులు.. కేరళలో 241 మంది బాధితులు, ఇద్దరు మృతి.. తమిళనాడు లో124 కరోనా బాధితులు, ఒకరు మృతి.. ఢిల్లీలో 121 మంది బాధితులు, ఇద్దరు మృతి.. కర్ణాటకలో 101 పాజిటివ్ కేసులు, ముగ్గురు మృతి… యూపీలో 104 మంది బాధితులు…రాజస్థాన్‌లో 93 మంది బాధితులు… మధ్యప్రదేశ్ 86 కేసులు, నలుగురు మృతి చెందారు.

గుజరాత్‌లో కరోనా బారినపడిన వారి సంఖ్య 82 ఉండగా ఆరుగురు మృతి చెందారు. జమ్మూకాశ్మీర్‌లో 55 మంది బాధితులు, ఇద్దరు మృతి… హర్యానాలో 43 మంది బాధితులు.. పంజాబ్‌లో 41 మంది బాధితులు, నలుగురు మృతి.. పశ్చిమ బెంగాల్‌లో 27 మంది బాధితులు, నలుగురు మృతి, బీహార్ 21 కేసులు, ఒకరు మృతి, చండీగడ్ 15, లడక్ 13, అండమాన్ 10, చత్తీస్‌గఢ్ 9, ఉత్తరాఖండ్ 7, గోవా 5, హిమాచల్‌ప్రదేశ్ 3, ఒడిశా 3, పుదుచ్చేరి 3, అసోం, ఝార్ఖండ్, మిజోరాం, మణిపూర్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu