HomeTelugu Big Storiesభారత్‌లో 50 వేలకు చేరువలో కరోనా కేసులు

భారత్‌లో 50 వేలకు చేరువలో కరోనా కేసులు

12 5
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువలో ఉంది. గత 3 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2958 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 126 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 49,391కి చేరింది. ఇప్పటి వరకు 1694 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం దేశవ్యాప్తంగా 14,183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 33,514 మంది చికిత్సపొందుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్క్ దాటింది. ఇవాళ ఒక్కరోజే 769 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబైలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 10,527 మందికి చేరింది. ఇప్పటి వరకు 412 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 16,758కి చేరింది. గుజరాత్ 6,625, ఢిల్లీ 5,104, తమిళనాడు 4,829, రాజస్థాన్ 3317, మధ్యప్రదేశ్ 3138, యూపీ 2998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా @ 1107
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య బుధవారం నాటికి 1107కి చేరింది. ఇవాళ కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇవాళ కరోనా నుంచి కోలుకుని 20 మంది డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు 648 మంది డిశ్చార్జి అయినట్లు రాష్ట్ర ఆరోగ్య వైద్యశాఖ వెల్లడించింది. మరో 430 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.
ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో కరోనా @ 1777
ఏపీలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1777కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో ఏపీలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాల వారీగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 533 మంది కరోనా బాధితులు ఉండగా, గుంటూరు
363, కృష్ణా 300, నెల్లూరు 92, కడప 90, చిత్తూరు 82, అనంతపురం 80, ప్రకాశం 61, ప.గో 59, తూ.గో 46, విశాఖ 39, శ్రీకాకుళం జిల్లాలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 729 మంది డిశ్చార్జి కాగా, 1012 మంది చికిత్స పొందుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu