దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1624కి చేరింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య అసాధారణంగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 320కి చేరింది. ముంబైలో కొత్తగా 16 కేసులు, పుణెలో 2 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మహారాష్ట్రలో 12 మంది చనిపోయారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 46 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9 లక్షలకు చేరువలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 42,151 మంది చనిపోయారు. ఇవాళ కరోనాతో ప్రపంచవ్యాప్తంగా మరో ఐదుగురు మృతిచెందారు. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఇటలీలో పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే ఆదేశంలో మృతుల సంఖ్య 12 వేలు దాటింది. ఇటలీ తర్వాత స్పెయిన్‌లో కరోనా మరణాలు భారీగా నమోదయ్యాయి. 8 వేల మందికి పైగా స్పెయిన్‌వాసులు కరోనాకు బలయ్యారు. ఫ్రాన్స్‌లో కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చైనా కంటే ఎక్కువగా ఫ్రాన్స్‌లో 3,523 మంది కరోనాతో మృతిచెందారు. ఇరాన్, బ్రిటన్, నెదర్లాండ్స్‌లో కరోనా ఊహించని వేగంతో విస్తరిస్తోంది.