హీరో విశాల్ కుటుంబానికి కరోనా పాజిటివ్ అంటూ కోలీవుడ్లో వార్తలు వ్యాపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ హీరో విశాల్ ట్వీట్ చేశారు. ‘ఆ వార్తలు నిజమే. మా నాన్నకి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఆయనకి సాయం చేసే క్రమంలో నాకు కూడా జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి.
అలాగే ఇవే లక్షణాలు నా మేనేజర్లో కూడా ఉన్నాయి. మేమంతా ఆయుర్వేదిక్ మెడిసెన్ తీసుకుంటున్నాము. ఒక వారంలో ప్రమాదం నుంచి బయటపడతాము. ప్రస్తుతానికి మా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గుడ్ బై’ అని విశాల్ తన ట్విటర్లో పోస్టు చేశారు.