HomeTelugu Trendingతెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌

తెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌

6 25
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా మరో ముగ్గురికి ఈ వైరస్‌ సోకింది. తొలిసారిగా హైదరాబాద్‌లో ఇద్దరు వైద్యులతో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కుత్బుల్లాపూర్‌కి చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యుల నమూనాలు పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. కుత్బుల్లాపూర్‌కి చెందిన వ్యక్తి ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చారు.. కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే ఆయనకూ పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. 43 ఏళ్ల డాక్టర్‌ నుంచి వైద్యురాలిగా ఉన్న అతడి భార్యకూ వైరస్‌ వ్యాపించింది. ఇప్పటికే ప్రైమరీ కాంటాక్ట్‌ కేసుల సంఖ్య 9కి చేరింది. తాజాగా నమోదైన కేసులతో ప్రస్తుతం తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 44కి చేరుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu