భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 57 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1490 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 24,942కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో భారత్‌లో 779 మంది మృతిచెందారు. 5,210 మంది దీనిబారినుంచి కోలుకుని బయటపడ్డారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 301 మంది మరణించారు. గుజరాత్‌లో 127, మధ్యప్రదేశ్ 92, ఢిల్లీలో 53 రాజస్థాన్ 27, యూపీ 26, తమిళనాడు 22, కర్నాటక 18, బెంగాల్ 18, పంజాబ్‌లో 17 మంది కరోనాతో మృతిచెందారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 31 మంది, తెలంగాణలో 26 మంది కరోనా బారినపడి మృతిచెందారు. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర 6,817 కేసులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గుజరాత్‌లో 2,815, ఢిల్లీలో 2,514, రాజస్థాన్ 2034, మధ్యప్రదేశ్‌లో 1,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.