HomeTelugu Big Storiesకరోనా ఎఫెక్ట్‌.. తెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు బంద్‌

కరోనా ఎఫెక్ట్‌.. తెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు బంద్‌

4 13
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కొవిడ్‌ -19 కేసులు దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ దాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. జనసందోహాలు లేకుండా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో విద్యా సంస్థలను ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో భేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ను మూసివేయాలని నిర్ణయించారు. అలాగే, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను సైతం కుదించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 20 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేపు, ఎల్లుండి సమావేశాలు నిర్వహించి.. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదించి ఆ రోజుతో సమావేశాలు ముగించనున్నారు.

మరోవైపు, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 83కు చేరింది. ఈ మహమ్మారి సోకి ఇప్పటివరకు దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu