తెలంగాణపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్కరోజులో 200కి పైగా కేసులు నమోదవడం రికార్డ్. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,496కి పెరిగింది. ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతిచెందారు. ఇవాళ్టి కేసుల్లో 152 కేవలం హైదరాబాద్ పరిధిలోనివే. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 123 మంది మృతిచెందారు. ఇక సీఎంఓలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి కూడా కరోనా బారిన పడ్డారు. మెట్రో రైల్ భవన్‌లో ఆయన ఉంటున్నారు. ఆయన కుమారుడు ఇటీవల ముంబై నుంచి వచ్చినట్టు తెలిసింది. అతడి కుమారుడి ద్వారా కరోనా సోకినట్టు భావిస్తున్నారు. తెలంగాణలో కరోనాతో కోలుకుని ఇప్పటి వరకు 1710 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 1663 మంది
వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.