తెలంగాణలో ఇవాళ కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1367కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 31 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ మరో ఇద్దరు మృతిచెందగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 34 కి చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇవాళ 117 మంది డిశ్చార్జి అయ్యారని, మరో 397 మంది చికిత్సపొందుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో గత 14 రోజులుగా 26 జిల్లాల్లో ఒక్కటి కూడా కొత్త కరోనా కేసు నమోదుకాలేదని ప్రకటించారు. అలాగే 3 జిల్లాల్లో జీరో పాజిటివ్ కేసులున్నట్టు వెల్లడించారు. గత 3 రోజులుగా హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతుండటం గమనార్హం.