భారత్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గత 24 గంటల్లో మరో 4,970 మందికి కరోనా సోకింది. 134 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 3,163 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 31,174 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 58,802 మంది చికిత్సపొందుతున్నారు. దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 35 వేలు దాటింది. 1249 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 2005 కేసులు నమోదయ్యాయి. 51 మంది మృతిచెందారు. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,448, గుజరాత్ 12,141, ఢిల్లీ 10,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.