తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1593 కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 1002 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 556 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. మరోవైపు ఇవాళ 10 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా బారిన పడి 34 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన 41 పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 26 కేసులు కాగా.. ఇతర రాష్ట్రాలకు చెందినవారిలో 12 మందికి, మేడ్చల్ జిల్లాలో ముగ్గురికి కరోనా సోకింది.