HomeTelugu Big Storiesభారత్‌లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

11
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 1,755 పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 35,365 కి చేరింది. ఇప్పటి వరకు 9,065 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1152 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అత్యధికంగా మహారాష్ట్రలో 10,498 మంది కరోనా బారిన పడ్డారు. 459 మంది ప్రాణాలు కరోనా హరించేసింది. మరోవైపు గుజరాత్‌లోనూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గుజరాత్‌లో 4,395, ఢిల్లీ 3515, మధ్యప్రదేశ్ 2719, రాజస్థాన్ 2584, తమిళనాడు 2323, యూపీ 2281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజూపెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కర్నూలు జిల్లాలో 25 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరులో కొత్తగా 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1463కి చేరింది. ఇవాళ మరో ఇద్దరు కరోనాతో మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 33కి చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 1027 మంది చికిత్సపొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 403 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు: కర్నూలు 411, గుంటూరు 306, కృష్ణా 246, నెల్లూరు 84, చిత్తూరు 80, కడప 79, అనంతపురం 67, ప్రకాశం 60, ప.గో. 58, తూ.గో 42, విశాఖ 25, శ్రీకాకుళం 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇవాళ కొత్తగా 6 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 1044కి చేరింది. ఇవాళ మరో 24 మంది కోలుకుని డిశ్చార్చి అయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu