తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణలో 99 కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2891కి చేరింది. కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 92కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 70 కేసులు ఉన్నాయి. రంగారెడ్డి 7, మేడ్చల్ 3, నల్గొండ 2, మహబూబ్ నగర్ 1, జగిత్యాల 1, మంచిర్యాల 1, సంగారెడ్డి 1, సిద్ధిపేట 1, వలస కార్మికులు 12 మందికి కరోనా సోకింది. అయితే, లాక్ డౌన్ 5.0లో అనేక సడలింపులు ఇవ్వడంతో కేసులు రోజూ పెరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. కరోనా నుంచి కోలుకుని 1526 మంది డిశ్చార్జి కాగా, మరో 1273 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.