ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం సాయంత్రానికి 143కి చేరింది. ఇవాళ ఒక్కరోజు కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత చేసిన పరీక్షల్లో 123 మంది రక్తనమూనాలను పరిశీలించగా 112 మందికి నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో 8, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో అత్యధికంగా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నెల్లూరు – 21, గుంటూరు – 20, ప్రకాశం – 17, కడప – 16, పశ్చిమ గోదావరి 14, విశాఖపట్నం 11, చిత్తూరు – 9, తూర్పుగోదావరి 9, అనంతపురం – 2, కర్నూలు జిల్లాలో ఒకటి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 143 కేసులు నమోదయ్యాయి.