HomeTelugu Trendingతెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి.. ఏపీ 439, తెలంగాణ 563 కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి.. ఏపీ 439, తెలంగాణ 563 కేసులు

10 12

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా రెండో దశలోనే ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు, ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ సదస్సుకు వెళ్లి వచ్చిన వారి ద్వారా ఏపీ, తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య సోమవారం సాయంత్రానికి 439కి చేరింది. ఇప్పటి వరకు ఏపీలో కరోనా బారిన పడి చికిత్స అనంతరం 12 మంది కోలుకున్నారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు 84, నెల్లూరు 56, ప్రకాశం 41, కృష్ణా 36, కడప 31, చిత్తూరు 23, ప.గో 23, విశాఖ 20, తూ.గో. 17, అనంతపురం 15 కరోనా కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా ఫ్రీ జిల్లాలుగా నిలిచాయి. ఈ జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.

తెలంగాణలోనూ కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. ఇవాళ ఒక్కరోజు కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒకరు మృతిచెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో 563 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం కేసీఆర్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు రోజుకు 1100 మందికి వైద్య పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. అన్ని ల్యాబ్‌లు, ఆస్పత్రులను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu