తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఉధృతమవుతోంది. ఇవాళ కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు 928 మందికి కరోనా సోకినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 194 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు రాష్ట్రంలో 23 మంది
మృతిచెందారు. ఇవాళ సూర్యాపేటలో 26 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. హైదరాబాద్‌లో 19, నిజామాబాద్ 3, గద్వాల 2, ఆదిలాబాద్ 2, ఖమ్మం, మేడ్చల్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కి చేరుకుంది. ఇవాళ ఉదయం విడుదల చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకారం కొత్తగా 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 158, కృష్ణా 83, నెల్లూరు 67, చిత్తూరు 53, కడప
46, ప్రకాశం 44, ప.గో 39, అనంతపురం 36, తూ.గో 26, విశాఖలో 21 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం భారత్‌లో 18,985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 603 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దీనిబారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన 3,260 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఒక్కరోజు ముంబైలో 355 కొత్త కేసులు
నమోదయ్యాయి, 12 మంది మృతిచెందారు. ముంబైలో ఇప్పటి వరకు 150 మంది కరోనాతో మరణించారు. గుజరాత్‌లో 90 మంది మృతిచెందారు.