దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3244 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 70,756కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే 87 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2293కి చేరింది. కరోనా నుంచి 22,454 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 46,008 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న తీరుపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోదీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా వలస కార్మికుల తరలింపుతో పాటు జోన్ల వారీగా ఇస్తున్న సడలింపుల నేపథ్యంలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ జాతి నుద్దేశించి ప్రధాని మోదీ మరోసారి ప్రసంగించనున్నారు. ఈ నెల 17తో మూడోవిడత లాక్‌డౌన్ ముగియనుండటంతో తదనంతర పరిణామాలపై ప్రజలకు సందేశం ఇచ్చే అవకాశం ఉంది.