HomeTelugu Newsఏపీలో కరోనా కేసులు @ 1177

ఏపీలో కరోనా కేసులు @ 1177

10 25

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం కొత్తగా 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1177కి చేరింది. కొత్తగా కృష్ణా జిల్లాలో 33 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా ఇప్పటి వరకు కర్నూలులో అత్యధికంగా 292 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుంటూరు 237, కృష్ణా 210, నెల్లూరు 79, చిత్తూరు 73, కడప 58, ప్రకాశం 56, అనంతపురం 53, ప.గో 54, తూ.గో 39, విశాఖ 22, శ్రీకాకుళం 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 235 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో కరోనాబారిన పడి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 911 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సోమవారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,003కి చేరింది. 16 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 646 మంది కరోనాతో చికిత్సపొందుతున్నారు. ఇప్పటి వరకు 332 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 25 మంది మృతిచెందారు.

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 28,380కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాబారిన పడి 886 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ కొత్తగా 488 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 6,361 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 21,132 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 8,068 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుజరాత్ 3,301, ఢిల్లీ 2,918, రాజస్థాన్ 2,185, మధ్యప్రదేశ్ 2,168, ఉత్తరప్రదేశ్ 1,995 తమిళనాడు 1,885 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో రికవరీ రేటు 22.17 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 16 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని, అలాగే 85 జిల్లాల్లో 14 రోజులుగా కరోనా
కేసులు లేవని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu