చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్ 19 (కరోనా వైరస్) ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసింది. చాలా రోజుల నుండి అనేక మంది ఈ లక్షణాలతో ఆసుపత్రులలో చేరినా ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఈరోజు ఒక వ్యక్తికీ ఈ వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా వ్యాధి ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈమేరకు వార్డ్ లో పెట్టి అతనికి చికిత్స చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఢిల్లీలో కూడా మరో కేసు నమోదైంది ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి వ్యాధి సోకినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఇండియాలో రెండు కేసులు నమోదైనట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. కరోనా కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం అనంతరం మంత్రి ఈటల అధికారికంగా మీడియాతో మాట్లాడనున్నారు.
..