యాంకర్ శ్రీముఖి నటించిన తాజా చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. మహిళలను కించ పరిచే విధంగా రూపొందించిన ‘క్రేజీ అంకుల్స్’ సినిమా విడుదల ను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ మహిళ హక్కుల వేదికగా అధ్యక్ష కార్యదర్శులు రేఖ,రత్నాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సోమజిగూడా ప్రెస్‌క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ లోనే మహిళలను కించ పరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు, మహిళ లను ఆట వస్తువు గా చూపిస్తూ, అసభ్య పద జాలంతో కూడిన సినిమా రూపిందించడం సరికాదు అన్నారు.
కేవలం ట్రైలర్ లోనే అంత అసభ్యత ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించవచ్చు అన్నారు. గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయని, కేవలం డబ్బు సంపాదన కోసమే యావత్ మహిళ జాతి ని కించపర్చడం అన్యాయమన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే విధంగా సినిమాలు తీయడం విచారకరమని అన్నారు. వెంటనే సినీ నిర్మాత,దర్శకులు, నటీనటులు యావత్ మహిళ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పి సినిమా విడుదల ను నిపివేయాలి అని హెచ్చరించారు. లేకుంటే యావత్ తెలుగు రాష్ట్రాల మహిళ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని అన్నారు. కాగా రేపు (ఆగష్టు19) విడుదల కానుంది.