దేశవ్యాప్తంగా కరోనా మహ్మమారి విజృభిస్తుంది. ఈ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు భారత్‌లో ప్రస్తుతం 21 రోజులు లాక్‌డౌన్ విధించారు.. అయిన ఈ వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో.. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించారు. ఈ సమయంలో అత్యవసర సేవలు మినహా.. ఎలాంటి ప్రార్థనలు, సభలు, సమావేశాలు, చివరకు ఫంక్షన్లకు కూడా అనుమతి లేదు. అంటూ ప్రజలు గుమ్మికూడడానికి అవకాశం ఉన్న ఏ కార్యక్రమానికి అనుమతి లేదు. దీంతో.. చాలా మంది తమ పెళ్లిళ్లు అంతకు ముందే నిశ్చయం అయినా.. కరోనా ప్రభావంతో వాయిదా వేసుకున్నారు. వీరిలో మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు. అయితే.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇది పట్టించుకోలేదు.. అంతకు ముందే పెళ్లి నిశ్చయం కావడంతో.. తన కుమారుడు, హీరో నిఖిల్ గౌడ వివాహాన్ని కన్నడ పొలిటికల్ లీడర్ కుమార్తె రేవతి జరిపించారు. రామ్‌నగర్ సమీపంలోని కేతగానహళ్లిలో ఫాంహౌస్‌లో పెద్ద ఆర్భాటం లేకుండానే పెళ్లి నిర్వహించారు.. పెళ్లికి తక్కువ సంఖ్యలోనే ఇరు కుటుంబాల పెద్దలు, దగ్గర బంధువులు హాజరైనట్టు తెలుస్తోంది.
అయితే, పెళ్లి జరిగిన కాసేపటికే నిఖిల్ పెళ్లిపై నివేదిక కోరింది కర్ణాటక ప్రభుత్వం.. లాక్‌డౌన్ సమయంలో వివాహం జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్.. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే వ్యవస్థను వెక్కిరించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇప్పటికే రామ్‌నగర్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు ఇచ్చాం.. పెళ్లిపై నివేదిక కోరామన్న ఆయన.. జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడామన్నారు. ఈ వివాహానికి దేవెగౌడ కుటుంబసభ్యులు, పెళ్లి కుమార్తె రేవతి కుటుంబసభ్యులు హాజరుకాగా.. పెళ్లిలో సామాజిక దూరం పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి.. ఇక, సోషల్ డిస్టన్స్ పాటించలేదని కామెంట్లు పెడుతూ.. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అసలు ఎవరూ మాస్క్‌లు ధరించలేదు.. సామాజిక దూరం పాటించలేదని ప్రశ్నల వర్షం కురిపంచారు. అయితే, చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ హెచ్చరించారు. దీంతో… ఇప్పుడు.. పెళ్లి అయిన కాసేపటికే.. ఆ వేడుకపై వివాదం రాజుకున్నట్టయ్యింది.