స్టార్ హీరోయిన్ సమంత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో సామ్ జామ్ ప్రోగ్రామ్ ప్రసారమవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఇటీవలే అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు అర్జున్‌ని సమంత ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ ఈ రోజు రాత్రి టెలీకాస్ట్ అవుతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ పేరుకి ముందు స్టైలిష్ స్టార్ అని కాకుండా ‘మెగాస్టార్’ అని రాశారు. దాంతో మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఓ స్థాయిలో మండిపడ్డుతున్నారు. చిరంజీవికి ఉండే బిరుదును దక్కించుకునే అర్హత ఏ హీరోకూ లేదని సామాజిక సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. బన్నీకి ఇప్పటికే స్టైలిష్ స్టార్ అన్న బిరుదు ఉందని చెబుతున్నారు. సొంత ఓటీటీ ఉంటే ఆ సంస్థ యజమాని కుమారుడికి మెగాస్టార్ బిరుదు ఇచ్చేస్తారా? అని నిలదీస్తున్నారు.
దీంతో ఈ విషయాన్ని గుర్తించిన ఆహా సిబ్బంది బన్నీ పేరుకి ముందు మెగాస్టార్ ట్యాగ్‌ను తీసేసి, అల్లు అర్జున్ పేరుకు ముందు స్టైలిష్ స్టార్ అన్న ట్యాగ్ యాడ్ చేసింది. ఈ వివాదంపై ‘ఆహా’ స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పింది. ఇది సాంకేతిక తప్పిదంగా పేర్కొంటూ తమ ట్విట్టర్ లో ప్రకటన చేసింది. ప్రేక్షకులు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని పేర్కొంది. ఆ ప్రోగ్రాం చివరలో అనుకోకుండా ఓ పొరపాటు కారణంగానే మెగాస్టార్ అన్న పేరు వచ్చి, ఇలా జరిగిందని చెప్పింది. ప్రేక్షకులు తమపై ఆదరాభిమానాలను ఇలాగే కొనసాగించాలని కోరింది. బాధపడ్డ ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పింది. ఒకే ఒక మెగాస్టార్ ఉన్నాడని, ఈ విషయం అందరికీ తెలుసని పేర్కొంది.
It’ the last day of a crazy year. So, let’s forgive, forget and step into 2021 with love, light and laughter! 🧡 pic.twitter.com/9CDluQ1U90
— ahavideoIN (@ahavideoIN) December 31, 2020