HomeTelugu News'నోటా' పై వివాదం..!

‘నోటా’ పై వివాదం..!

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ‘నోటా’. ఈ చిత్రంపై వివాదం చోటు చేసుకుంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగు రచన హక్కుల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఒప్పందాన్ని అతిక్రమించి తనను చిత్రం నుంచి తొలిగించారని రచయిత శశాంక్‌ వెన్నలకంటి పోలీసులను ఆశ్రయించాడు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజాపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న నోటాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల రిలీజ్‌ అయిన టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

9 14

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌పై కూడా వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి కాకుండా నోటాకు ఓటెయ్యమనేలా ప్రేరేపించేలా ఈ మూవీ టైటిల్ ఉందని సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ పొలిటికల్‌ లీడర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్‌ కథనాయిక. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాని అక్టోబర్‌ 4న రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu