కాంగ్రెస్ 13 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. అధిష్ఠానం ఆమోద ముద్ర అనంతరం ఈ జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ విషయంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సందిగ్ధత వీడిన విషయం తెలిసిందే. ఆయన జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆ పార్టీ రాష్ర్ట వ్యవహారాల బాధ్యుడు ఆర్‌సీ కుంతియా స్పష్టం చేశారు. కోదండరాం పెద్ద మనుసు చేసుకుని ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు ఇచ్చారని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి 12 తర్వాత కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పొన్నాల లక్ష్మయ్య సహా 13 మందితో కాంగ్రెస్ తాజా జాబితాను విడుదల చేసింది.
అభ్యర్థుల వివరాలు:
భోథ్(ఎస్టీ)- సోయం బాపురావు
నిజామాబాద్ అర్బన్-తాహెర్ బిన్ హమ్దాన్
నిజామాబాద్ రూరల్ – డా. రేకుల భూపతి రెడ్డి
బాల్కొండ- ఈ. అనిల్‌కుమార్
ఎల్బీనగర్ -డి. సుధీర్‌రెడ్డి
కార్వాన్-ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజారి
యాకత్‌పురా- కె. రాజేందర్ రాజు
బహదూర్‌పుర – కలేం బాబా
కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్‌రెడ్డి
దేవరకొండ(ఎస్టీ)- బాలునాయక్
తుంగతుర్తి(ఎస్సీ)-అద్దంకి దయాకర్
జనగామ – పొన్నాల లక్ష్మయ్య
ఇల్లందు(ఎస్టీ)- బానోత్ హరిప్రియ నాయక్