Samantha Malayalam Debut:
స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గత ఏడాదిన్నర గా సినిమా తెరపై కనిపించలేదు. అయితే, ఇటీవల ఆమె మొదటి మలయాళం సినిమా సైన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంతా మమ్ముట్టితో జతకట్టనుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది.
తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ముహూర్తం కార్యక్రమం జరిగింది. కానీ ఇందులో ఎక్కడా సమంతా కనిపించలేదు. పోనీ బిజీగా ఉండి లేదా హెల్త్ బా రాలేకపోయిందా అంటే.. ఈ సినిమాపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అయినా పెట్టచ్చు కానీ.. సామ్ అలా కూడా ఏమీ చేయలేదు. దీంతో అసలు ఆమె ఈ సినిమాకు సైన్ చేయలేదేమో అనే మాటలు పెరుగుతున్నాయి.
కొందరేమో సినిమా నుండి సమంత తప్పుకుని ఉండచ్చు అంటున్నారు. ఇంకో వైపు సమంతా హిందీలో ఓ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకో రెండు వెబ్ సిరీస్ కు ఆల్రెడీ ఆమె చేతులో ఉన్నాయి. తన స్వంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ ని ప్రారంభించి ఒక తెలుగు సినిమా నిర్మించనున్నట్టు, ఈ ప్రాజెక్టులు ఇంకా మొదలు కాలేదు.
సమంతా నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో క్లారిటీ లేకపోవడం ఆమె అభిమానులను అయోమయానికి గురిచేస్తోంది. సామ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఫోటోలు పంచుకుంటూ ఉన్నప్పటికీ, ఆమె సినిమాలు మాత్రం ప్రశ్నార్థకంగా ఉన్నాయి.