చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అక్కడ మరిన్ని కఠిన ఆంక్షలు అమలుకు అధికారులు సిద్ధమయ్యారు. శ్రీకాళహస్తి లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్న కలెక్టర్ వెల్లడించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని ఆదేశించారు. ఇతరులు కూడా ఈ ప్రాంతంలోకి రాకుండా కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. నిత్యావసరాలు, మెడిసిన్స్ డోర్ డెలివరీ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన ఆంక్షలు తప్పవని ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.