ప్రముఖ బుల్లితెర యాంకర్ రవిపై ఎస్‌ఆర్ నగర్ పోలిస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫోన్‌లో బెదిరించటంతో పాటు రౌడీలతో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ సందీప్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. రవి నుంచి 15 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు సందీప్. ఆ డబ్బును తిరిగి వసూళు చేసుకునేందుకు బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై రవిని స్టేషన్‌కు పిలిపించి విచారించిన పోలీసులు కేసు విషయంలో అవసరమైనప్పుడు విచారణకు హజరు కావాలన్నారు.
ఎస్ఆర్ నగర్ పోలీసులు తనను అరెస్ట్ చేశారనే వార్త విషయమై యాంకర్ రవి స్పందించాడు. దీపావళి ప్రత్యేక కార్యక్రమం కోసం తాను ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్నానని వివరణ ఇచ్చాడు. సందీప్‌పై దాడికి స్కెచ్ వేశాననే వార్తలు అవాస్తవమని రవి తెలిపాడు. తప్పుడు ఆరోపణలతో వ్యూహాత్మకంగా అతడు తనపై శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని తెలిపాడు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పాడు. సందీప్‌తో ఆర్థిక వివాదం ఉన్న మాట వాస్తవమేనని చెప్పిన రవి.. నా తొలి సినిమా ‘ఇది మా ప్రేమ కథ’ కు అతడు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడని తెలిపాడు. ‘ఆ పరిచయంతోనే కొద్ది నెలల క్రితం సందీప్‌కి కొంత సొమ్ము ఇచ్చాను. వారంలో తిరిగి ఇస్తానని చెప్పిన అతడు మాట తప్పాడు. డబ్బు ఎగ్గొట్టడం కోసం తెలివిగా నాపై ఫిర్యాదు చేశాడ’ని రవి తెలిపాడు.