బాహుబలి2 సినిమాను ప్రదర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకి ఆరు షోలను ప్రదర్శించే విధంగా పర్మిషన్స్ ఇచ్చింది. ఈ విషయం పట్ల చిత్రనిర్మాతలు, అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేసినప్పటికీ తెలుగు సినిమా ఆడియన్స్ అసోసియేషన్ సంస్థ ఈ విషయంపై ఏపీ హోంశాఖ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేసింది. నియమాల ప్రకారం అర్ధరాత్రి 1 నుండి ఉదయం 8 గంటల వరకు సినిమాలు ప్రదర్శించకూడదు.
అలా చేస్తే అది రాజ్యాంగం విరుద్ధం అవుతుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్మాతలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో అర్ధరాతి షోలను ప్రదర్శిస్తారని అది చట్ట విరుద్ధమని అభ్యంతరం తెలిపింది. కాబట్టి మరోసారి అదనపు షోల విషయంలో ప్రదర్శనకు ఇచ్చిన అనుమతిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన ఏపీ హోంశాఖ ప్రధాన కార్యదర్శి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని
చెప్పారు.