HomeTelugu News'2.ఓ' సినిమాపై వివాదం

‘2.ఓ’ సినిమాపై వివాదం

దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో స్టార్‌ హీరో రజనీకాంత్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘2.ఓ’. దేశ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ‘2.ఓ’ను తెరకెక్కించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాష్‌కరణ్‌ ఈ సినిమా నిర్మించారు. అక్షయ్‌కుమార్‌, అమీజాక్సన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘2.ఓ’ సినిమాపై వివాదం మొదలైంది. సెల్‌ఫోన్‌ వినియోగాన్ని ఈ సినిమాలో ప్రమాదకరంగా చూపిస్తున్నారంటూ సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(కాయ్‌) సెన్సార్‌బోర్డు, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. టీజర్‌, ట్రైలర్‌లలో మొబైల్‌ఫోన్లు, టవర్లు పర్యావరణానికి హానికరం అన్న రీతిలో చూపించారని దీనిపై సెన్సార్‌బోర్డు మరోసారి పునః సమీక్ష జరపాలని ఫిర్యాదులో పేర్కొంది.

14 1

‘మొబైల్‌ ఫోన్లు, టవర్లు పక్షులకు హాని కలిగిస్తాయని చిత్రంలో తప్పుగా చూపించారు’ అని కాయ్‌ అభిప్రాయపడింది. అక్షయ్‌ ఇందులో పక్షి ప్రేమికుడిగా కనిపిస్తారని సమాచారం. సెల్‌ఫోన్‌, సెల్‌ టవర్ల వల్ల పక్షులకు జరిగిన హానికి ప్రతీకారంగా పోరాటం చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెన్సార్‌బోర్డుకు కాయ్‌ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. సెల్‌ఫోన్‌ వల్ల పర్యావరణానికి హాని జరిగినట్లు శాస్త్రీయంగా ఎక్కడా రుజువుకాలేదని పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu