జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆదిపై ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కోనట్లుగా తెలుస్తోంది. ఆది, స్క్రీఫ్ట్ రైటర్.. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పై కూడా ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. అయితే గతంలో కూడా ఆదిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. గతంలోనూ హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులు, హద్దుమీరిన కామెడీపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.