బాలీవుడ్ హీరోయిన్ ‘అనుష్క శర్మ’.. ‘పాతాళ్ లోక్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ పలువురి ప్రశంసలను పొందింది. ఇదే సమయంలో విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఈ సిరీస్ పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. ‘ది ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్’ సభ్యులు ఈ ఫిర్యాదు చేశారు.
తమ గూర్ఖా సమాజాన్ని అవమానకరంగా చిత్రీకరించారని ఫిర్యాదులో ఆరోపించారు. రెండో ఎపిసోడ్ లో తమను కించపరిచే విధంగా ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారని తెలిపారు. ఆ సీన్ లో వచ్చే డైలాగ్స్ వినపడకుండా మ్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అనుష్కశర్మకు గూర్ఖా సమాజానికి చెందిన కొన్ని వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అనుష్కపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా పోరాడతామని తెలిపాయి.