బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పలు అంశాలపై వివాదస్పద సంచలన వ్యాఖ్యలు చేసి వివాదల్లో చిక్కుకుంటుంది. ముఖ్యంగా రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వారందరినీ తీవ్రవాదులుగా అభివర్ణిస్తూ కంగన చేస్తున్న ట్వీట్లు వావాదాలను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంగన అందరికీ దూరమవుతోంది. ఆమె ఇప్పటివరకు ఎండార్స్ చేస్తున్న బ్రాండ్స్ కూడా ఆమెకు దూరంగా జరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
‘నేను గొప్ప చెప్పుకోవటానికి కాదు.. ఫెయిర్నెస్ క్రీమ్లు ఐటెమ్ నంబర్లు షోలు చేయను. పెద్ద హీరోల సినిమాల్లో నటించను. అయితే.. ఇప్పుడు మిగిలిన బ్రాండ్లు కూడా నా కాంట్రాక్టులు రద్దు చేశాయి. అయినప్పటికీ.. నేను తక్కువ సంపాదించినా ప్రతిఫలం ఎక్కువే”అని రాసుకొచ్చారు కంగనా.
I don’t mean to brag,I don’t do fairness creams,item numbers,shows,big hero films and now all brands cancelled my contracts also,still whatever little I earn most of it I give away and in return gain so much more,not able to express how to encourage people to give,that’s all🙂
— Kangana Ranaut (@KanganaTeam) February 5, 2021