Committee Kurrollu OTT:
హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నిహారిక కొణిదెల తొలిసారి నిర్మాతగా తీసిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు ఆగస్టు 9న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.20 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.
ఒక గ్రామీణ నేపథ్య కథతో సాగే ఈ సినిమా ఒక సోషల్ మేసేజ్ కూడా అందిస్తుంది. యంగ్ కాస్ట్ తో రూపొందించబడిన ఈ సినిమాకు యధు వంశీ తొలిసారి దర్శకత్వం వహించగా, నిహారిక తల్లి పద్మజ కొణిదెల, జయలక్ష్మి కలిసి నిర్మించారు. హను-మాన్ ఫేమ్ అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఇప్పటికే పాపులర్ OTT ప్లాట్‌ఫామ్ ETV విన్ ద్వారా ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా సెప్టెంబర్ 12న డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా శాటిలైట్ ప్రసారం హక్కులను ETV సొంతం చేసుకుంది. టెలికాస్ట్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
కమిటీ కుర్రోలు విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హిట్ టాక్ తెచ్చుకుంది. నిహారిక నిర్మాతగా తన మొదటి ప్రయత్నంలోనే మంచి విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం కూడా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.