టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. తెలుగు సినిమాల్లో హీరోగా, కమెడియన్‌గా, నటుడిగా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇక, ఇటీవల ఈ సమస్య మరింత తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే, కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా మారినట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వేణు మాధవ్‌కు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
వేణు మాధవ్ స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ.. స్కూల్‌లో విద్యను అభ్యసించే టైంలోనే మిమిక్రీ చేయడం అలవాటు చేసుకున్నాడు.. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించేవాడు.. వేణు మాధవ్‌కు టీడీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి.. తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆయనతో ప్రత్యేక ప్రదర్శన ఇప్పించేవారు. ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టిన వేణు.. తనకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ అవార్డులు, నంది అవార్డులతో పాటు పలు అవార్డులు ఆయనను వరించాయి.