జబర్దస్త్ కామెడీ షో గుర్తింపు తెచ్చుకున్న నటుడు వేణు. టాలీవుడ్లో పలు సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. జబర్దస్త్ కారణంగా కొన్నేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. తాజాగా వేణు..దర్శకుడిగా మారాడు. ఇండస్ట్రీలోని పలువురు నటులు దర్శకులుగా మారడం కొత్తేం కాదు. అయితే అలా వచ్చిన వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా హీరోలు.. దర్శకులుగా మారి సత్తా చూపించారు.
అయితే కమెడియన్లు దర్శకులుగా మారి హిట్లు కొట్టిన సందర్భం మాత్రం చాలా తక్కువ.ఆ మధ్య వెన్నెల కిషోర్ డైరెక్షన్ రంగంలో అడుగు పెట్టాడు. అయితే తీసిన రెండు, మూడు సినిమాలు ఫ్లాప్లుగా మిగిలి ఆయనకు నిరాశను మిగిల్చాయి. అవసరాల శ్రీనివాస్ మాత్రం దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఎప్పుడు ఇదే బాటలో మరో కమెడియన్ కూడా మెగా ఫోన్ పడుతున్నాడు.
అతడి పూర్తి పేరు వేణు ఎల్దండి. ఈయన దర్శకుడిగా వస్తున్న తొలి చిత్రం ‘బలగం’. ఈ సినిమా మార్చి 3న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా.. తూనీగ తూనీగా అంటూ చిన్నప్పుడు అలరించిన కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఊళ్లో ఉన్న 200 మంది జనం బలగం సినిమాలో నటించారు. ఇందులో నాచురల్ యాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. వేణు కూడా ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటానని నమ్మకంగా చెబుతున్నాడు. పైగా దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో బలగంకు థియేటర్స్ కూడా బాగానే దొరుకుతున్నాయి. ఈ వారం సినిమాలు కూడా లేకపోవడం ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు