పలువురు సినీ తారలు ఇప్పటికే కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిస్థితులను చూసి కొందరు హీరోలు, హీరోయిన్‌లు మళ్లీ మళ్లీ అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొందరు మారడం లేదంటూ వీడియోల ద్వారా సందేశాన్ని పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హాస్య నటుడు వడివేలు తాజాగా అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో.. ‘చాలా మనోవేదనకు గురవుతున్నా. ప్రభుత్వం చెప్పే మాటలను అర్థం చేసుకోండి. వారి ఉత్తర్వుల మేరకు అందరూ కొన్ని రోజులపాటు ఇళ్లలోనే ఉండండి. వైద్య ప్రపంచమే భయాందోళనకు గురవుతోంది. వైద్యులు, నర్సులు ప్రాణాలను పనంగా పెట్టి సేవలందిస్తున్నారు. దయచేసి అందరూ సహకరించండి. ఎవరూ బయటకు రాకండి. పోలీసులు కూడా మిమ్మల్ని బతిమలాడటాన్ని చూస్తున్నా. బిడ్డాపాపలతో హాయిగా ఇంట్లోనే ఉందాం. ఎవరూ తేలికగా తీసుకోకండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడూ నవ్వించే ఆయన ఇలా కన్నీళ్లతో సందేశమిస్తుండటం అందరినీ కదిలిపజేస్తుంది.
நம்ம சந்ததிகளுக்காக, நம்ம வம்சாவழிக்காக எல்லோரும் வீட்டுலயே இருங்க 🙏 pic.twitter.com/I6wMMyl57W
— Actor Vadivelu (@VadiveluOffl) March 26, 2020