
Comedian Kapil Sharma remuneration:
కామెడీ కింగ్ కపిల్ శర్మ మరోసారి తన హవా చూపిస్తున్నాడు. The Kapil Sharma Show భారీ విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు అతను The Great Indian Kapil Sharma Show తో ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయ్యాడు. ఈ కొత్త షో Netflix లో ప్రసారం కానుండగా, కపిల్ అందుకోనున్న పారితోషికం విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు.
రిపోర్ట్స్ ప్రకారం, కపిల్ ఒక్క ఎపిసోడ్‌కి ఏకంగా 5 కోట్లు తీసుకుంటున్నాడు! ఇది టెలివిజన్ కామెడీ షోలలో ఇప్పటి వరకు ఎవరూ పొందని అత్యధిక రెమ్యూనరేషన్. అయితే, షోలో నటిస్తున్న ఇతర నటుల పారితోషికం కపిల్‌తో పోల్చితే చాలా తక్కువగా ఉంది.
కపిల్‌తో గతంలో కలిసి పని చేసిన ప్రముఖ నటుడు సునీల్ గ్రోవర్ ఈ షోలోనూ కనిపించనున్నాడు. అతనికి ఒక్క ఎపిసోడ్‌కి 25 లక్షలు చెల్లిస్తున్నారని సమాచారం. అర్చనా పూరణ్ సింగ్ మరియు కృష్ణ అభిషేక్ లు ఒక్క ఎపిసోడ్‌కి 10 లక్షలు అందుకుంటున్నారు. కికూ శార్దా మాత్రం 7 లక్షలు తీసుకుంటున్నాడు.
కపిల్ తన షోతో మళ్లీ టాప్ కామెడీ స్టార్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈసారి అతని హాస్యపు మేజిక్ ఎలా ఉంటుందో చూడాలి! Netflix లో త్వరలో ప్రసారం కానున్న ఈ షో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.