HomeTelugu Trendingగీతా సింగ్ ఇంట విషాదం

గీతా సింగ్ ఇంట విషాదం

comedian geetha singh son d
టాలీవుడ్‌ నటి గీతా సింగ్ ఇంట విషాదం నెలకొంది. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దత్తత కుమారుడు మృతి చెందాడు. మరో నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. కారులో అయినా, బైక్‌పై అయినా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, కమెడియన్ గీతా సింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, ఓం శాంతి అంటూ ఆమె ఆ పోస్టులో పేర్కొంది.

కాగా గీతా సింగ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన అన్నయ్య పిల్లలను దత్తత తీసుకుని పంచుకుంటోంది. అన్నయ్య అనారోగ్యంతో మృతి చెందగా.. ఆయన ఇద్దరు పిల్లలకు అన్ని తానై చూసుకుంటోంది. తాజాగా కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా వీరిలో ఆమె పెద్ద కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గీతా సింగ్‌ ఎవడిగోల వాడిది, కితకితలు వంటి సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుంది. అయితే తరువాత కూడా పలు సినిమాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో ఆమెకు పెద్దగా అవకాశలు లేవు. ఇటువంటి సమయంలో గీతా సింగ్‌కు కొడుకు కూడా దూరం అవ్వడం మరింత బాధాకరం. విషయం తెలిసిన నెటిజన్లు, అభిమానులు గీతాసింగ్‌కు సంతాపం తెలుపుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu